: ఓ ఇంటివాడైన పాకిస్తానీ క్రికెటర్ మహ్మద్ అమీర్


పాకిస్థాన్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్ ఓ ఇంటివాడయ్యాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న అమీర్ ఈ మధ్యే మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. ఆరేళ్ల క్రితం ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా మహ్మద్ అమీర్ బ్రిటిష్ పాకిస్థానీ యువతి నర్జిస్ తో ప్రేమలో పడ్డాడు. ఆ పర్యటనలోనే స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి నిషేధానికి గురయ్యాడు. వారి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు 2014లో పచ్చజెండా ఊపి నిశ్చితార్థం చేశారు. సోమవారం మెహందీ నిర్వహించగా, మంగళవారం రిసెప్షన్, బుధవారం వలీమా నిర్వహించారు. లాహోర్ లో ఘనంగా జరిగిన వీరి వివాహానికి పాకిస్థాన్ క్రికెటర్లు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమీర్ కు పీసీబీ శుభాకాంక్షలు చెప్పింది.

  • Loading...

More Telugu News