: సరిహద్దు ఆవల పొంచివున్న 50 మంది ముష్కరులు


యూరీ ఆర్మీ బేస్ పై దాడి తరువాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ, సరిహద్దులకు ఆవల దాదాపు 50 మంది వరకూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాలు పసిగట్టాయి. వీరు అదను కోసం వేచి చూస్తున్నారని తెలియడంతో జమ్మూ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. వీరంతా జమ్మూ పరిధిలోని ఖతువా నుంచి అఖ్నూర్ సెక్టార్ మధ్య అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో దాక్కుని ఉన్నారని తెలుస్తోంది. వీరు భారత్ లోని రాకెట్ లాంచింగ్ ప్యాడ్స్ కు సమీపంలోనే ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేయడంతో ఈ ప్రాంతంలో భద్రతను మరింతగా పెంచారు.

  • Loading...

More Telugu News