: జిల్లాను మూడు ముక్కలు కానివ్వొద్దంటూ.. ఆదిలాబాద్ బంద్
ఆదిలాబాద్ జిల్లాను మూడుగా విభజించవద్దని డిమాండ్ చేస్తూ జిల్లా సంరక్షణ సమితి బంద్ చేపట్టింది. గత ఏడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన తెలిపిన ఆందోళనకారులు నేడు జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా వేకువజామునే ఆర్టీసీ డిపో వద్దకు వెళ్లి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బంద్ కు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలపడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇతర రవాణా సాధనాలు ఎంచుకోవాలని ఆందోళనకారులు సూచించారు. ఆదిలాబాద్ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్మల్ ను ఆదిలాబాద్ నుంచి వేరు చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు.