: బాన్ కీ మూన్ చతురోక్తులు.. నవ్వుతూ ఉండిపోయిన ఒబామా!


ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) ప్రధానకార్యదర్శి బాన్ కీ మూన్, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ కలిసిన సందర్భంలో చతురోక్తులు, నవ్వులు వెల్లివిరిశాయి. యూఎన్ సర్వసభ్య సమావేశానికి హాజరైన అతిథుల గౌరవార్థం యూఎన్ చీఫ్ ఇచ్చిన విందు ఇందుకు వేదిక అయింది. కాగా, బాన్ కీ మూన్ పదవీకాలం వచ్చే డిసెంబర్ 31తో ముగియనుండగా, అమెరికా అధ్యక్షుడిగా ఒబామా వచ్చే ఏడాది జనవరి 20తో వైట్ హాస్ కు వీడ్కోలు పలకనున్నారు. బాన్ కీ మూన్, ఒబామాల పదవీ కాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో వారిద్దరూ కలిసే చివరి సమావేశం ఇదే కావడం విశేషం. ఇక, ఈ విందులో బాన్ కీ మూన్ కు కొద్ది దూరంలో ఒబామా కూర్చున్నారు. ఈ సందర్భంగా బాన్ కీ మూన్ ‘మిస్టర్ ప్రెసిడెంట్.. మనం ఏదో ఒక పనిని వెతుక్కోవలసి ఉంటుంది. గోల్ఫ్ ఆటలో మీతో ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను. అయితే, బాస్కెట్ బాల్ ఆటలో మాత్రం నాకు సవాల్ విసరకండి’ అంటూ ఆయన చమత్కరించారు. ఇందుకు ప్రతిస్పందనగా .. ఒబామా కేవలం నవ్వుతూ ఉండిపోయారు.

  • Loading...

More Telugu News