: టీఆర్ఎస్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోంది!: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్


పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే, విప్ సంపత్ కుమార్ అన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకం పెరిగిందన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయించిన వారిని ప్రజలు చీరి చింతకు కడతారని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రజలు ఇప్పుడు ఎవరిని చీరి చింతకు కట్టాలి.. సీఎం కేసీఆర్ నా? స్పీకర్ నా? లేక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలనా? అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాలుగా అడ్డూ ఆపూ లేకుండా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు టీఆర్ఎస్ పాల్పడుతోందని సంపత్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News