: కమేడియన్ శ్రీనివాసరెడ్డికి ఝలక్కిచ్చిన సుమ


యాంకర్ సుమను టైమింగ్ లో నెంబర్ వన్ అని పేర్కొంటుంటారు. ఎలాంటి స్క్రిప్టు లేకుండా పంచ్ డైలాగులు వర్షంలా కురిపించడంలో సుమ స్టైలే వేరు. అందుకే సుమ యాంకరింగ్ అంటే ఇష్టపడని తెలుగు వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇక సినిమాల్లో మంచి టైమింగ్ కలిగిన కమేడియన్ గా పేరుతెచ్చుకున్న శ్రీనివాసరెడ్డికి 'ప్రేమమ్' ఆడియో వేడుకలో సుమ ఝలక్కిచ్చింది. పాటను ఆవిష్కరించేందుకు స్టేజ్ మీదకి వచ్చిన శ్రీనివాసరెడ్డిని అతని నిజజీవితంలో జరిగిన ప్రేమను వెల్లడించమని సుమ కోరింది. దీనికి శ్రీనివాసరెడ్డి సమాధానమిస్తూ... తనను చాలా మంది ప్రేమించారని, ఇప్పటికీ తనకు ఇంకా పెళ్లి కాలేదని చాలా మంది భావిస్తున్నారని అన్నాడు. 'సంతూర్ మదర్'లా తాను సంతూర్ డాడీనని అన్నాడు. వెంటనే అందుకున్న సుమ... టాలీవుడ్ లో నాగార్జున ఉండగా అలా భావించడం ఇంకొకరికి సాధ్యమా? అని ప్రశ్నించింది. అంతే, 'టైమింగ్ లో మిమ్మల్ని మించినవారు లేరండీ' అని కితాబునిచ్చాడు.

  • Loading...

More Telugu News