: ఎనిమిదేళ్ల కుక్కకు ఎనిమిది ఐఫోన్ 7ఎస్ లు బహుమతి... చక్కగా పోజులిచ్చిన శునకరాజం!
తాము పెంచుకునే జంతువుల పట్ల వాటి యజమానులు ఎంతో ప్రేమను చూపుతూ, తమ కుటుంబ సభ్యుల్లానే చూసుకుంటారనడంలో సందేహం లేదు. కానీ, ఈ చైనా బిలియనీర్ పుత్రరత్నం అలా కాదు. ఏకంగా తమ పెంపుడు శునకానికి ఎనిమిదో పుట్టిన రోజున ఏకంగా ఐఫోన్ 7ఎస్ ఫోన్లు ఎనిమిదింటిని తెప్పించి బహుమతిగా ఇచ్చాడు. చైనాలో ఫోర్బ్స్ లెక్క ప్రకారం 30 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2 లక్షల కోట్లకు పైగానే) అత్యంత ధనవంతుడిగా పేరున్న వాంగ్ జియాన్ లిన్ కుమారుడు వాంగ్ సికాంగ్ ఈ పని చేశాడు. తన పెంపుడు కుక్క 'కోకో'కు ఖరీదైన బట్టలు, షూస్, స్పెక్ట్స్, గోల్డ్ చైన్, కాలికి యాపిల్ వాచ్ వంటి సౌకర్యాలెన్నో సమకూర్చి పెట్టిన సికాంగ్, ఐఫోన్ 7 ఎస్ లు తెచ్చి పెట్టిన వేళ, వాటితో 'కోకో' పోజులివ్వగా, అవిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నట్టు ప్రపంచం మొత్తంలో అత్యంత రాజభోగాలు అనుభవిస్తున్న శునకరాజం కూడా ఇదేనట.