: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగిన ప్ర‌యాణికులు


హైద‌రాబాద్ శివారులోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయికి వెళ్లే విమానం కోసం వ‌చ్చిన 30 మంది ప్ర‌యాణికులు ఆందోళ‌న‌కు దిగారు. ట్రావెల్ ఏజెంట్ మోసంతో వారికి టికెట్లు క‌న్ఫార్మ్ కాలేదు. దీంతో వారిని ఎయిర్‌పోర్టు అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు. అధికారుల తీరుకు నిర‌స‌న‌గా వారు ఎయిర్‌పోర్టులోనే ఆందోళ‌న‌కు దిగారు. అధికారులు వారికి న‌చ్చజెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ట్రావెల్ ఏజెంట్ మోసానికి గుర‌యిన త‌మ‌కు న్యాయం చేయాల‌ని, త‌మ‌ను దుబాయికి పంపించాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News