: ఎస్సార్ నగర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్.. అదుపులోకి అనుమానితులు
హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 400 మంది పోలీసులతో ఈ ఉదయం తనిఖీలు చేశారు. 25 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 41 బైకులు, కారు, ఆటోలను సీజ్ చేశారు. ఇటీవల తరచూ నగరంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మరిన్ని ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్‌లు కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు.