: చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం.. గ్రామస్తులను వణికించిన ఏనుగుల గుంపు


గ్రామ‌స్తుల‌పైకి గ‌జ‌రాజులు దూసుకొచ్చి వారిని వణికిపోయేలా చేసిన ఘ‌ట‌న ఈరోజు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఎస్. గొల్లపల్లిలో జ‌రిగింది. ఒక్కసారిగా ఏనుగులు త‌మ‌పైకి వ‌స్తుండ‌డంతో గ్రామ‌స్తులు వాటి నుంచి త‌ప్పించుకోవ‌డానికి ప‌రుగులు తీశారు. సమీప అటవీ ప్రాంతం నుండి వ‌చ్చిన‌ ఈ గ‌జ‌రాజులు ముందుగా అక్క‌డి క్యాబేజి పంటను నాశ‌నం చేశాయి. అనంతరం గ్రామంలోకి వ‌చ్చి క‌నిపించిన వారిపైకి దూసుకొచ్చాయి. వీధిలో ఉన్న ప్ర‌జ‌లు ఇళ్లలోకి వెళ్లి త‌లుపులేసుకున్నారు. గ‌జ‌రాజుల భ‌యం నుంచి తేరుకొని అంతాక‌లిసి వ‌చ్చి కాగడాలు వెలిగించి ఏనుగుల‌ను అడవిలోకి తరిమికొట్టారు. గ‌జ‌రాజులు అడవి సమీపంలో ఉన్న కంచెను కూడా నాశనం చేశాయ‌ని గ్రామ‌స్తులు వాపోతున్నారు. అటవీ అధికారులు ఈ విష‌యంపై స్పందించాల‌ని వేడుకుంటున్నారు.

  • Loading...

More Telugu News