: ఉద్యోగులకు దసరా కానుక ఇచ్చిన కేటీఆర్... ఆందోళన విరమించిన నాలుగో తరగతి ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తోన్న తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ సీసాలతో హైదరాబాద్‌లోని టీఎన్‌జీవో భవన్‌లో ఉద్యోగులు ఈరోజు ఉదయం నుంచి ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. దసరాలోపు ఉద్యోగులందరినీ తెలంగాణకి తీసుకొస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ నుంచి వారికి హామీ వచ్చింది. అక్కడకు చేరుకున్న తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, ఉద్యోగ సంఘాల నేతలు వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. దసరా పండుగని ఏపీలో పనిచేస్తోన్న టీ.ఉద్యోగులు తెలంగాణలోనే జరుపుకుంటారని దేవీప్రసాద్ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. ఉద్యోగుల తరలింపుపై సాయంత్రంలోపు అధికారికంగా ప్రకటన వస్తుందని అన్నారు.