: బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్‌కు సెల్ఫీల ట్రెండ్ అస్సలు నచ్చట్లేదట!
గతంలో తమ అభిమాన సినీనటులు, క్రీడాకారులు, రాజకీయవేత్తలను కలిస్తే ఎవరైనా సరే ఆటోగ్రాఫ్‌లు అడిగేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఏ సెలబ్రెటీ కనపడినా అభిమానులు ఓ సెల్ఫీ ప్లీజ్ అని అడుగుతున్నారు. అభిమానుల కోరికకు తగ్గట్టుగానే సెలబ్రెటీలు సెల్ఫీలకు పోజులిస్తున్నారు. అభిమానులు వాటిని ఎంతో గర్వంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొని లైకులు, కామెంట్లు సాధించి సంబరపడిపోతున్నారు. అయితే, సెల్ఫీల ట్రెండ్ తనకు అస్సలు నచ్చడం లేదని బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌ధావన్ అంటున్నాడు. తన బాల్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నటిస్తున్న చిత్రం షూటింగ్‌కి తాను వెళ్లినట్లు వరుణ్‌ధావన్ చెప్పాడు. అక్కడకి వచ్చిన ఎంతో మంది సల్మాన్ అభిమానులు సల్మాన్‌తో మాట్లాడారని, అది తనకు ఎంతో నచ్చిందని ఆయన పేర్కొన్నాడు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న సెల్ఫీ ట్రెండ్ తనకు నచ్చడం లేదని చెప్పాడు. తనకు అభిమానులతో ముచ్చడించడం, వారి గురించి తెలుసుకోవడం అంటేనే ఇష్టమని చెబుతున్నాడు. సెలబ్రెటీల వల్లే సెల్ఫీల ట్రెండ్ అధికమయిందని అంటున్నాడు. తామంతా ఎన్నో రకాలుగా సెల్ఫీ ఫొటోలు తీసుకొని సామాజిక మధ్యమాల్లో అభిమానుల ముందు ఉంచుతుంటామని, అయితే, ఇది అంత మంచి పద్ధతి కాదని తనకనిపిస్తున్నట్లు వరుణ్‌ధావన్ పేర్కొన్నాడు. ఫోటోల కంటే లైఫ్ ఎంతో అందమైనదని, అందుకే తాను అభిమానుల్ని ప్రత్యక్షంగా కలిసి ముచ్చటించేందుకే ఇష్టపడతానని చెప్పాడు.