: పార్టీ ఫిరాయింపుల కేసులో రేవంత్‌రెడ్డి అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గతంలో ఎమ్మెల్యేలు సంపత్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు వేసిన పిటిషన్‌లు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి. అయితే, పిటిషన్ వేసిన వారిలో ఒకరైన ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్ఎస్‌లోకి జంప్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. కేసులో విచారణను సుప్రీంకోర్టు వచ్చేనెల 19కి వాయిదా వేసింది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసేందుకు టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి అభ్యర్థన పెట్టుకున్నారు. అయితే, దీన్ని సుప్రీం తిరస్కరించింది.