: భరత ముని అవార్డ్స్...ఉత్తమ చిత్రంగా ‘కంచె’


భరతముని ఫిల్మ్ అవార్డ్స్ కింద ఉత్తమ చిత్రంగా ‘కంచె’ ఎన్నికైంది. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకుడు రొమ్మాల మునికృష్ణారెడ్డి ప్రకటించారు. 2015 సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు ఉత్తమ నటీనటులు, సాంకేతిక వర్గానికి అవార్డులను ఇస్తున్నట్లు తెలిపారు. సామాజిక శ్రేయస్సు, జాతీయసమైక్యత,కళాత్మక విలువలు, సహజత్వం మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ అవార్డులను ఇస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో హైదరాబాద్ లో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అవార్డులకు ఎంపికైన చిత్రాల వివరాలను తెలిపారు. సందేశాత్మక చిత్రంగా దాగుడుమూతలు, హాస్య చిత్రంగా భలేభలే మగాడివోయ్, చారిత్రాత్మక చిత్రంగా రుద్రమదేవి, ప్రజాదరణ పొందిన చిత్రంగా బాహుబలిని ఎంపిక చేశామన్నారు. ఉత్తమనటుడిగా రాజేంద్రప్రసాద్, ప్రత్యేక ప్రశంసా నటుడిగా వరుణ్ తేజ్, ఉత్తమనటిగా అనుష్క, విలన్ గా తనికెళ్ల భరణి ఎంపికయ్యారన్నారు.

  • Loading...

More Telugu News