: గ్యాంగ్ రేప్ లు, బిర్యానీలో బీఫ్... చిన్న విషయాలే: విమర్శలు కొనితెచ్చుకున్న హర్యానా సీఎం

హర్యానాలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న జంట హత్యలు, అక్కా చెల్లెళ్ల గ్యాంగ్ రేప్, మేవాత్ లో బిర్యానీలో బీఫ్ తదితర సంచలనం కలిగించిన నేరాలను చాలా చిన్న విషయాలని తీసిపారేసిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విమర్శలు కొని తెచ్చుకున్నారు. హర్యానా రాష్ట్రం ఏర్పడి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. "ఇవన్నీ చాలా చిన్న విషయాలు. వీటిపై నేను దృష్టిని పెట్టను. దేశంలోని అన్ని చోట్లా ఇవి జరుగుతూనే ఉంటాయి. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఎలా సాగించాలన్నదే నేను ఆలోచిస్తున్నా" అని అన్నారు. ఆగస్టు 24న 20, 14 ఏళ్ల వయసున్న అమ్మాయిలను, వారి అంకుల్, ఆంటీలను కొట్టి చంపి, గ్యాంగ్ రేప్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులను తీసిపారేయడంపై అటు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తగా, ఖట్టర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది.

More Telugu News