: 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో మోహన్ బాబు ఎందరో ఆప్తులను సంపాదించుకున్నారు: వెంకటేష్


40 ఏళ్ల సినీ ప్రస్థానంలో మోహన్ బాబు ఎంతో మంది ప్రేమాభిమానాలు సంపాదించుకున్నారని సినీ నటుడు వెంకటేష్ తెలిపారు. విశాఖపట్టణంలో టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 40 ఏళ్లు సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎందరో ఆప్తులు, మరెందరో మిత్రులను మోహన్ బాబు సంపాదించుకున్నారని చెప్పారు. ఎంతో మంది అభిమానుల ఆదరణ ఆయనకు లభించిందని, ఇంతకంటే ఒక నటుడుకి కావాల్సింది ఏముంటుందని ఆయన అన్నారు. ఆయన మరింత కాలం ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆయనను సత్కరించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News