: గూగుల్ డుయో యాప్... కోటి మార్క్ ను దాటిన డౌన్ లోడ్స్

గూగుల్ నెల క్రితం విడుదల చేసిన వీడియో కాలింగ్ యాప్ డుయో చాలా మందికి తెగనచ్చేసినట్టుంది. నెల రోజుల్లోనే కోటి మంది ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నారు. గూగుల్ కమ్యూనికేషన్ విభాగం హెడ్ అమిత్ ఫులే దీనిపై ట్వీట్ చేశారు. ‘గూగుల్ డుయో కోటి యూజర్ల మార్క్ ను దాటింది. ఆదరణ చూపినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. డుయో యాప్ గూగుల్ ప్లే స్టోర్ ఉన్న అన్ని దేశాల్లోనూ అందుబాటులో ఉంది. అయితే ఇంత ఆదరణ ఉన్నప్పటికీ గూగుల్ ప్లే స్టోర్ లోని ఫ్రీ యాప్స్ ప్రపంచంలో మాత్రం డుయో 124వ స్థానంలో ఉండడం గమనించాల్సిన విషయం. దేశీయంగానూ ఫ్రీ యాప్స్ చార్ట్ లో గూగుల్ డుయో 24వ స్థానంలో ఉంది. మైక్రోసాఫ్ట్ స్కైప్, వైబర్ పోటీలను తట్టుకునేందుకు డుయోను గూగుల్ గత నెలలో విడుదల చేసింది. ఈ యాప్ నెట్ వర్క్ తగినంత లేని ప్రాంతాల్లోనూ పనిచేయడం విశేషం. కాలర్ వీడియో ప్రివ్యూను చూపించడం ద్వారా ఆ కాల్ రిసీవ్ చేసుకోవాలాఅ? లేక వదిలేయాలా? అన్నది నిర్ణయించుకునే ఫీచర్ ఉంది.

More Telugu News