: గోడమీద పిల్లిలా కాదు... కొమరం పులిగా రా!: పవన్ కు రోజా సలహా

ప్రజాసేవ చేయాలని, రాజకీయాల్లోకి రావాలని ఆలోచించే పక్షంలో గోడమీద పిల్లిలా తడవకో మాట చెప్పకుండా కొమరం పులిలా వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు పోరాడాలని వైకాపా ఎమ్మెల్యే రోజా, పవన్ కల్యాణ్ కు సలహా ఇచ్చారు. తిరుపతిలో జరిగిన అఖిలపక్ష నేతల నిరాహారదీక్షలో పాల్గొన్న ఆమె, ఎన్నికలు జరుగుతున్నప్పుడు వచ్చిన పవన్, టీడీపీ, బీజేపీలకు మద్దతిస్తున్నట్టు చెప్పి వెళ్లిపోయారని, ఆపై రెండున్నరేళ్ల సమయంలో రెండు మీటింగులు పెట్టి డైలాగులు కొట్టారని ఎద్దేవా చేశారు. చేతనైతే ఎన్టీఆర్ లా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి చూపాలని సవాల్ విసిరారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానాలు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె, నాడు పవన్ కూడా హోదా వస్తుందని చెప్పారని, ఇప్పుడిక రెండున్నరేళ్ల తరువాత ఇంకా వేచి చూసే ధోరణి ఏంటని అడిగారు.

More Telugu News