: కాలేజీలో ఉరి వేసుకుని ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్‌లో ఓ ప్రైవేటు కాలేజీలో సెకండ్ ఇయ‌ర్ ఇంటర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. ఈ రోజు ఉద‌యం కాలేజీ పైఅంత‌స్తులో ఉరేసుకుని చంద‌న అనే విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనిని గ‌మ‌నించిన తోటి విద్యార్థినులు విష‌యాన్ని త‌మ లెక్చ‌రర్ ల‌కి చెప్పారు. కాలేజీ యాజ‌మాన్యం విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌పై పోలీసుల‌కి స‌మాచారం అందించింది. సైదాపూర్ మండ‌లం రాముల‌ప‌ల్లికి చెందిన ఈ విద్యార్థిని త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News