: కాంగ్రెస్ వ్యూహం... హోం శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ నేత చిదంబరం


కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం హోం శాఖ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు పార్లమెంటు బులెటిన్ ను విడుదల చేస్తూ, ఇదే సమయంలో వ్యక్తిగత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, న్యాయశాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ గా ఆనంద్‌ శర్మను నియమించారు. ఈ రెండు పానల్స్ కు రాజ్యసభకు చెందిన కాంగ్రెస్ సభ్యులే నేతృత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్ తన వ్యూహంలో భాగంగా తాజాగా చిదంబరంను హోమ్ శాఖ వ్యవహారాలకు మార్చింది. ఇక ట్రాన్స్ పోర్ట్, టూరిజం సాంస్కృతిక శాఖ కమిటీకి ముకుల్‌ రాయ్ ని, రైల్వేలపై నియమించిన కమిటీకి సుదీప్‌ బంద్యోపాధ్యాయను చైర్మన్‌ గా నియమిస్తున్నట్టు తెలియజేసింది. కార్మిక శాఖ కమిటీకి నేతృత్వం వహిస్తున్న జేడీయూ నేత వీరేంద్ర ఇంధన శాఖకు, ఇంధన శాఖకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ నేత కిరీట్ సోమయ్యను కార్మిక శాఖకు మారుస్తున్నట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News