: జపాన్ ఓపెన్‌కు సింధు దూరం.. ఊపిరి సలపని కార్యక్రమాలే కారణం
రియో ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు జపాన్ ఓపెన్‌కు దూరమైంది. రియో నుంచి తిరిగి వచ్చిన సింధు శిక్షణలో పాల్గొనాల్సి ఉన్నా ఊపిరి సలపని కార్యక్రమాలతో బిజీగా మారిపోయింది. ఎడతెరిపిలేని కార్యక్రమాలు, సన్మానాలతో బిజీబిజీగా గడిపేసింది. ఫలితంగా శిక్షణలో పాల్గొనలేకపోయిన సింధు వచ్చే వారం జరగనున్న జపాన్ ఓపెన్‌కు దూరమైంది. అలాగే ఈనెల 27వ తేదీ నుంచి జరగనున్న కొరియా ఓపెన్ సూపర్ సిరీస్‌లోనూ సింధు బరిలోకి దిగే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. అక్టోబరు 18 నుంచి జరిగే డెన్మార్క్ ఓపెన్ సిరీస్‌లో సింధు బరిలోకి దిగే అవకాశం ఉంది.