: రంగారెడ్డి జిల్లాలో పెను విషాదం.. గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి వెళ్లి న‌లుగురు చిన్నారుల మృతి


రంగారెడ్డి జిల్లాలో ఈరోజు పెను విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కందుకూరు మండలం భూపతినగర్‌లో గ‌ణేశ్ శోభాయాత్ర‌లో పాల్గొన్న న‌లుగురు చిన్నారులు గ‌ణేశుడిని చెరువులో నిమ‌జ్జ‌నం చేస్తోన్న స‌మ‌యంలో అందులో ప‌డి ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన చిన్నారులు బ‌న్నీ(8), స‌న్నీ(10), శివ‌(12), శిల్ప‌(13)లుగా గుర్తించారు. ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న పోలీసులు చిన్నారుల మృత‌దేహాల‌ను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌న‌ట‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News