: విశాఖ‌లో రెండో రోజు కొన‌సాగుతున్న బ్రిక్స్ స‌ద‌స్సు


విశాఖ‌ప‌ట్నంలో నిన్న ప్రారంభ‌మైన‌ బ్రిక్స్‌ (బ్రెజిల్, ర‌ష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల స‌ద‌స్సు రెండో రోజు కొన‌సాగుతోంది. ఈ స‌ద‌స్సులో ప్లీన‌రీ స‌మావేశం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రాల‌పై ఈరోజు చ‌ర్చ జ‌రుగుతోంది. స‌మావేశంలో ప‌లువురు ప్ర‌తినిధులు ప్ర‌సంగిస్తున్నారు. విశాఖ‌ప‌ట్నంపై జీవీఎంసీ క‌మిష‌న‌ర్ హ‌రినారాయ‌ణ ప్ర‌జంటేష‌న్ ఇస్తున్నారు. తమ దేశాలలో స్మార్ట్ సిటీల ఏర్పాటులో తీసుకుంటున్న చ‌ర్య‌లు, ఉప‌యోగిస్తోన్న సాంకేతిక‌త వివ‌రాల‌ను ఆయా దేశాల ప్ర‌తినిధులు తెలుపుతున్నారు.

  • Loading...

More Telugu News