: రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసిన టీపీసీసీ నేతలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టీపీసీసీ నేతల బృందం ఈరోజు కలిసింది. మల్లన్నసాగర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేసింది. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం, రైతులకు పరిహారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.