: జ్యోతికకు బైక్ డ్రైవింగ్ నేర్పించిన సూర్య... హెల్మెట్లు ధరించినా గుర్తుపట్టేసిన అభిమానులు!
సెలబ్రిటీలు ముఖ్యంగా సినీ నటులు బహిరంగంగా తిరిగితే అభిమానులు చుట్టుముట్టేస్తారు. చిన్నపాటి నటి లేదా నటుడు అయినా సరే, వారికి ఈ పరిస్థితి తప్పదు. అందుకే, టోపి, కళ్లజోడు ధరించి, తమ ముఖం కనపడకుండా ఒక కర్చీఫ్ కట్టుకుని ఎవరి కంటా పడకుండా దర్జాగా బైక్ పై వెళ్లే హీరోలు లేకపోలేదు. అయితే, హెల్మెట్లు ధరించినా కూడా సినీ దంపతులు సూర్య, జ్యోతికలను గుర్తుపట్టేశారు అభిమానులు. చెన్నైలో సూర్య తన భార్య జ్యోతికకు బైక్ డ్రైవింగ్ పాఠాలు నేర్పాడు. బైక్ పై ఉన్న జ్యోతిక, కింద నిలబడ్డ సూర్య హెల్మెట్లు ధరించి ఉన్నారు. జ్యోతిక కళ్లజోడు కూడా ధరించి ఉంది. అప్పటికే, రెండు, మూడు రౌండ్లు కొట్టింది. అయితే, ఆ రోడ్డుపై వెళుతున్న వాహనచోదకుల్లో కొంతమంది వీళ్లిద్దరిని గుర్తుపట్టేశారు. సైలెంట్ గా తమ సెల్ ఫోన్లను క్లిక్ మనిపించారు. ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారాయి.