: మాన్ శాంటోను కొనుగోలు చేసేందుకు రూ. 4.42 లక్షల కోట్లు ఆఫర్ చేసిన 'బేయర్'!


ప్రపంచ ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీలో అతిపెద్ద డీల్ కు రంగం సిద్ధమైంది. మాన్ శాంటోను కొనుగోలు చేసేందుకు బేయర్ సంస్థ ఏకంగా 66 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 4.42 లక్షల కోట్లు) ఆఫర్ చేసింది. ఒక్కో మాన్ శాంటో ఈక్విటీ వాటాకు 128 డాలర్లను ఆఫర్ చేసినట్టు బేయర్ వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్ ఓకే అయితే, ప్రపంచ విత్తనాలు, పురుగుమందుల రంగంలో 25 శాతం వాటా బేయర్ సొంతమవుతుంది. అందుబాటులోని సమాచారం ప్రకారం, డిసెంబర్ 2017లోగా డీల్ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఒకవేళ నియంత్రణాపరమైన అనుమతులు రాని పక్షంలో లావాదేవీ విఫలమైతే, 2 బిలియన్ డాలర్లను నష్టపరిహారంగా చెల్లించేందుకు బేయర్ అంగీకరించింది. డీల్ విషయమై దీనిపై అధికారికంగా స్పందించేందుకు అటు బేయర్, ఇటు మాన్ శాంటో ప్రతినిధులు అందుబాటులో లేరు. ఈ వార్త వెలువడిన తరువాత బేయర్ ఈక్విటీ వాటా విలువ 3 శాతం పెరిగింది. మాన్ శాంటోలో మొత్తం 44.2 కోట్ల వాటాలు ఉన్నాయి. ఈ డీల్ కుదిరితే ఓ జర్మన్ సంస్థ చేపట్టిన అతిపెద్ద కొనుగోలు రికార్డు కూడా బేయర్ పరమవుతుంది.

  • Loading...

More Telugu News