: ఏపీ పక్షపాతిగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు: కాంగ్రెస్ నేత వీహెచ్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఏపీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని కలిసిన గవర్నర్, ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజ్ లపై సమాచారం అందించారు కానీ, తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాత్రం వివరించలేదని అన్నారు. తెలంగాణలోని ‘మల్లన్న సాగర్’ రైతుల ఇబ్బందులు, రైతుల ఆత్మహత్యలు, పోలీసుల లాఠీఛార్జి, మహిళలపై బలప్రయోగం మొదలైన సమస్యలను కేంద్రం దృష్టికి గవర్నర్ ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న గవర్నర్ నరసింహన్ ను పదవి నుంచి తొలగించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.