: గణేశ్ నిమజ్జన వేడుకలో అపశ్రుతి.. విద్యార్థి మృతి
తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అయితే, నిజామాబాద్ జిల్లా దోమకొండలో విషాదం చోటుచేసుకుంది. గణనాథుడిని నిమజ్జనానికి తీసుకెళుతుండగా విద్యుదాఘాతానికి గురై ఐరేని వివేక్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. విద్యుత్ దీపాలు వెలిగించేందుకు విద్యుత్ లైన్‌కు కొండీలు వేస్తున్న క్రమంలో వైరు కిందపడింది. ఆ వైరు వివేక్ మీద పడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివేక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.