: నీలో ఇంత ద్వేషముందా?: ట్విట్టర్ లో విశాల్ పై మండిపడిన సినీ నటి రాధిక


తాజాగా నడిగర్ సంఘం తీసుకున్న నిర్ణయంతో సీనియర్‌ సినీ నటి రాధిక, విశాల్‌ మధ్య వివాదం మొదటి కొచ్చింది. నడిగర్ సంఘం నుంచి మాజీ అధ్యక్షుడు శరత్ కుమార్‌, రాధారవిని తొలగించడంపై ట్విట్టర్ మాధ్యమంగా రాధిక మండిపడ్డారు. ఈ మేరకు ఆమె పలు ట్వీట్లు చేశారు. అందులో... ‘మొదట 100 కోట్లు అన్నారు. ఇప్పుడు డిస్కౌంట్‌ ఇచ్చారా? అయినా ఆరోపణలు ఉన్నప్పుడు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా తొలగించడం కరెక్టేనా? నీలో ఇంత ద్వేషం ఉందా? ఇలా అడిగినందుకు నన్ను కూడా సస్పెండ్‌ చేయండి’ అని మండిపడ్డారు. కాగా, నడిగర్‌ సంఘానికి చెందిన 1.65 కోట్ల రూపాయల మోసానికి శరత్ కుమార్‌, రాధారవిలను తొలగించి, పోలీసు కేసు పెట్టేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో విశాల్ వివాహమంటూ కోలీవుడ్ లో కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News