: స్విస్ ఛాలెంజ్ పై ఏపీ అప్పీలు నేడే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానంపై ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నేడు రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకి వెళ్లనుంది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేయనుంది. సీఆర్డీఏ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం స్విస్ ఛాలెంజ్ విధానంలో సాంకేతిక అర్హత బిడ్లు దాఖలు చేసేందుకు గడువు నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు స్టే ఉత్తర్వుల నేపథ్యంలో ఆ ప్రక్రియను సీఆర్డీఏ నిలుపుదల చేసింది.