: నేను ‘మిలియనీర్’ను అయ్యాను: సినీ హీరో నాని
హిట్ చిత్రాల హీరో నాని తాను మిలియనీర్ ను అయ్యానంటూ ఒక ట్వీట్ చేశాడు. అయితే, మిలియనీర్ అయింది డబ్బు పరంగా కాదు, ట్విట్టర్లో తన ఫాలోవర్ల సంఖ్య పది లక్షలకు చేరుకుంది. ఈ ఆనందాన్ని పంచుకుంటూ, ‘ఇప్పుడు నేను మిలియనీర్ ను అయ్యాను. థ్యాంక్యు మై ట్విట్టర్ ఫ్యామిలీ’ అంటూ నాని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా, నాని తాజా చిత్రం ‘మజ్ను’ విడుదలకు సిద్ధంగా ఉంది.