: తమిళులపై దాడికి నిరసనగా నిరాహారదీక్షకు దిగనున్న విజయ్ కాంత్


కావేరి జలవివాదం నేపథ్యంలో కర్ణాటకలో తమిళులపై జరిగిన దాడిని నిరసిస్తూ డీఎండీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ కాంత్ నిరాహారదీక్షకు దిగనున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ నెల 16న చెన్నైలోని కోయంబేడులోని డీఎండీకే పార్టీ కార్యాలయం ఎదుట ఆయన నిరాహారదీక్షకు దిగనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, కర్ణాటకలోని తమిళుల హోటళ్లు, దుకాణాలు, వాహనాలపై కొందరు దాడులకు దిగడం, తమిళ యువకుడిపై దాడికి పాల్పడటానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

  • Loading...

More Telugu News