: 'ఈ చిన్నారులను గుర్తుపట్టండి' అంటూ అల్లు శిరీష్ పోస్ట్ చేసిన ఫొటో!
నలుగురు చిన్నారులు కలిసి ఉన్న ఒక ఫొటోను యువ హీరో అల్లు శిరీష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ నలుగురిలో ముగ్గురు అబ్బాయిలు నవ్వుతుండగా, ఒక అమ్మాయి మాత్రం మామూలుగా ఉంది. అయితే, వీళ్లందరూ మాత్రం పోజిస్తూ కెమెరావైపే చూస్తున్నారు. ‘ఈ చిన్నారులను గుర్తుపట్టండి. 90ల్లో కజిన్స్’ అంటూ ఆ ట్వీట్ లో శిరీష్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ కు అభిమానులు బాగానే స్పందించారు. రామ్ చరణ్, సుస్మిత, అల్లు అర్జున్, శిరీష్ అంటూ కొంతమంది అభిమానులు గెస్ చేశారు.