: 40 ఏళ్ల తరువాత విజయవాడ రైల్వే స్టేషన్ లో నిలిచిపోనున్న సర్వీసులు


40 ఏళ్ల తరువాత విజయవాడ రైల్వే స్టేషన్ లో పలు సర్వీసులు నిలిచిపోనున్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ను పునర్వ్యవస్థీకరించనున్నారు. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్ లో 9 రోజుల పాటు వివిధ రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు విజయవాడ రైల్వేస్టేషన్ మీదుగా ప్రయాణించాల్సిన 58 సర్వీసులను రద్దు చేయనున్నారు. మరో 64 రైళ్లను దారిమళ్లించనున్నారు. దీంతో సుమారు పది రోజుల పాటు విజయవాడ మీదుగా ప్రయాణించాల్సిన వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News