: సంయుక్తంగా సైనిక విన్యాసాల్లో పాల్గొననున్న పాకిస్థాన్, రష్యా
వచ్చే ఏడాది పాకిస్థాన్, రష్యా దేశాలు సంయుక్తంగా సైనిక విన్యాసాల్లో పాల్గొననున్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక తాజాగా పేర్కొంది. ఇరు దేశాలు కలిసి మొదటిసారిగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు రష్యాలో పాకిస్థాన్ రాయబారి ఖలీలుల్లా ఈ పత్రిక ద్వారా తెలిపారు. ‘ఫ్రెండ్ షిప్ -2016’ పేరిట ఈ సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందులో పాక్, రష్యాలకు చెందిన 200 మంది సైనికులు భాగస్వాములవుతారని ఆయన చెప్పారు. తాము నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంతో మాస్కో, ఇస్లామాబాద్ మధ్య రక్షణ రంగంలో సత్సంబంధాలు మరితం బలపడతాయని ఆయన అన్నారు.