: గణేశ్ నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు.. 9 మంది అరెస్ట్


భక్తి ముసుగులో అపచారానికి పాల్పడుతోన్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం కోనాల గ్రామంలో ఈరోజు చోటుచేసుకుంది. గణేశ్ నిమజ్జనంలో భాగంగా వినోదం పేరిట గ్రామంలో పలువురు అశ్లీల నృత్యాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో అస‌భ్య‌ నృత్యాలు చేస్తోన్న‌ న‌లుగురు మ‌హిళ‌లతో పాటు ఐదుగురు కార్య‌క్ర‌మ‌ నిర్వాహ‌కులు కూడా ఉన్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News