: జీజీహెచ్ ఘటనపై మంత్రి కామినేని ఆగ్రహం.. బాధ్యులపై చర్యలు తప్పవన్న మంత్రి


బతికున్న మగ శిశువును చనిపోయాడని చెప్పిన గుంటూరు జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) వైద్యులపై మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టిన బిడ్డ చనిపోయాడని చెప్పిన వైద్యులు ఎవరని మంత్రి ప్రశ్నించారు. బిడ్డలో కదలికలు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పినా వైద్యులు పట్టించుకోకపోవడంపై మంత్రి మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. కాగా, గుంటూరు శివారు దాసరిపాలెంకు చెందిన దుర్గాభవాని ఈరోజు ఉదయం జీజీహెచ్ లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసిబిడ్డను పరీక్షించిన వైద్యులు, చనిపోయాడని చెప్పారు. ఒక గంట సమయం తర్వాత ఆ శిశువు కదలడంతో వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. అయినా, వైద్యులు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో, ఆగ్రహించిన దుర్గాభవాని బంధువులు ఆందోళనకు దిగడంతో వైద్యులు స్పందించారు. ఆ శిశువును వెంటనే ఐసీయూలో ఉంచారు.

  • Loading...

More Telugu News