: పూర్తయిన ఖైరతాబాద్ మహాగణపతి లడ్డూ ప్రసాదం పంపిణీ.. వర్షంలోనూ పోటెత్తిన భక్తులు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి వర్షం కురుస్తోన్న విషయం తెలిసిందే. వర్షంలోనూ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈరోజు వినాయకుడి లడ్డూ ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వినాయకుడిని దర్శించుకున్న భక్తులు లడ్డూ ప్రసాదాన్ని సేకరించి హర్షం వ్యక్తం చేశారు. వర్షంలో తడుస్తూనే భారీగణనాథుడిని దర్శించుకుంటున్నారు. బక్రీదు సందర్భంగా ఈరోజు ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. సెలవు రోజు కావడంతో గణేశుడిని దర్శించుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్న భక్తులు వర్షం వచ్చినా తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు.