: తక్షణం ఢిల్లీకి రావాలని గవర్నర్ కు పిలుపు... రహస్య నివేదిక ఇవ్వనున్న నరసింహన్


తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను తక్షణం ఢిల్లీకి రావాలని కేంద్రం ఆదేశించింది. దీంతో సాయంత్రం 6 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. రెండు రాష్ట్రాల మధ్యా సంబంధాలపై తాను తయారు చేసిన రహస్య నివేదికను గవర్నర్ కేంద్రానికి అందించనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్ పంపిణీ విషయంలో నెలకొన్న వివాదం, హైదరాబాద్ లోని వివిధ శాఖల శాశ్వత భవనాల విషయంలో ఆస్తి తగాదాలు, ఉద్యోగులు, అధికారుల పంపకాలపై కేంద్ర హోం శాఖ అధికారులతో నరసింహన్ చర్చించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ ఉదయమే ఏపీ సీఎం గవర్నర్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయంత్రానికి ఢిల్లీకి ఆయన్ను రావాలని కోరడంతో, ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • Loading...

More Telugu News