: గణేశ్ నిమజ్జనం, బక్రీద్ సందర్భంగా పాతబస్తీలో పోలీసుల భారీ కవాతు
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం, బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు పాతబస్తీలో పోలీసులు భారీ మార్చ్ చేపట్టారు. పలువురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మొద్దని ప్రజలకి సూచించారు. పుకార్లను వ్యాప్తి చేయడానికి ఎవరయినా ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.