: మూడవ నెంబర్ బ్యాట్స్ మన్ గా అతను చాలా కీలకం...అతని మెడపై ఎప్పుడూ కత్తి వేలాడుతుంది: కుంబ్లే


మూడవ నెంబర్ ఆటగాడిగా ఛటేశ్వర్ పూజారా చాలా కీలకమైన ఆటగాడని టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపాడు. న్యూజిలాండ్ సిరీస్ కు జట్టు ఎంపిక సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టెస్టుల్లో టీమిండియాకు పూజారా కీలకమైన ఆటగాడని, అయినప్పటికీ ఆయన మెడపై ఎప్పుడూ కత్తి వేలాడుతుంటుందని, ఇది సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. టెస్టుల్లో ఆడే జట్టులో స్థానం కోసం చాలా మంది పోటీ పడుతున్నారని చెప్పిన కుంబ్లే, ఏదో ఒక కారణం చెప్పి పుజారాను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేస్తున్నారని అన్నారు. విండీస్ పర్యటనలో రెండు ఇన్నింగ్స్ ఆడిన పూజారా 16, 46 పరుగులు చేయగా, అతనిని పక్కన పెట్టి రోహిత్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. లోయర్ ఆర్డర్ లో పరుగులు కావాలని ఈ మార్పు చేసినప్పటికీ, అతను ఆడిన రెండు ఇన్నింగ్స్ లలో 9, 41 పరుగులకే పరిమితమయ్యాడు. చివరి టెస్టుకు ఇద్దర్నీ ఎంపిక చేసినప్పటికీ వర్షం కారణంగా అది రద్దైంది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగే సీరీస్ లో పుజారా సత్తా చాటుతాడని, జట్టుకు పూజారా కీలకమైన బ్యాట్స్ మన్ అని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News