: రైతు బాధలను బ్యాంకర్లు అర్థం చేసుకోవాలి: సీఎం చంద్రబాబు
రైతు బాధలను అర్థం చేసుకోవాలని, రైతులు బాగుంటేనే మనం బాగుంటామన్న విషయాన్ని బ్యాంకర్లు గుర్తించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు విజయవాడలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, సీఎస్ టక్కర్, బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, విత్తనాలు, ఎరువుల కొరతపై ఫిర్యాదులు రావట్లేదని, బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదని తమకు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. పేదవాడికి ప్రతి నెల రూ.10 వేలు లబ్ధి కలిగేలా ఆలోచనలు చేస్తున్నామన్నారు. భూమికి సంబంధించిన దస్తావేజులు పరిరక్షించాలని, వెబ్ ల్యాండ్ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. రోబోటిక్స్ వైపు దృష్టి సారించడం శుభపరిణామమని, సచివాలయంలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.