: భర్తే వివస్త్రను చేసి హింసించిన వేళ... ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులకు సుశ్రుత పెట్టిన వాట్స్ యాప్ మెసేజ్ ఇదే!
బాత్ రూములో వాటర్ హీటర్ ను ఎక్కువ సేపు వేసిందన్న కారణంతో కట్టుకున్న భర్త, ఒంటిపై బట్టలు కూడా లేవన్న ఇంగిత జ్ఞానాన్ని మరచి కుటుంబ సభ్యుల ముందు తీవ్రంగా హింసించిన వేళ, మనస్తాపానికి గురైన హైదరాబాదు వాసి సుశ్రుత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్యకు ముందు జరిగిన ఘటనపై తన తల్లిదండ్రులకు ఆమె వాట్స్ యాప్ మెసేజ్ పెడుతూ, తన బాధను చెప్పుకుంది. ఆ మెసేజ్ ని పోలీసు వర్గాలు మీడియాకు అందించాయి. "మళ్లీ బావ కొట్టిండు. నేను ఏమీ అనలేదు. హీటర్ కాసేపు ఎక్కువ పెట్టినా అని అన్నాడు. అప్పటికీ చూసుకోలేదు, తప్పయింది అన్నాను. అయినా బాత్ రూమ్ లో స్నానం చేస్తుంటే వచ్చి కొట్టిండు. బయటకు వచ్చాక బట్టలు కూడా వేసుకోనీయలే. వాళ్ల అమ్మ ఉంది కూడా. తోడికోడలు, వాళ్ల పిల్లలు చూస్తుండగానే బట్టలు లేకుంటే కొట్టాడు. మా మామయ్య పైకి వచ్చి ఆయననే సపోర్ట్ చేస్తుండు. ఏ ... కొడుకు వస్తాడో రానీ వాని సంగతి నేను చూసుకుంటా అని అన్నాడు" అంటూ తన పరిస్థితిని బాధతో చెప్పుకుని తనువు చాలించింది. ఈ కేసులో భర్త మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు విచారిస్తున్నారు.