: గవర్నర్‌తో భేటీ అయిన టీపీసీసీ నేతలు.. భూసేకరణపై ఫిర్యాదు
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో ఈరోజు ఉదయం టీపీసీసీ నేతల బృందం భేటీ అయింది. గవర్నర్‌తో చర్చించిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ ఉన్నారు. ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు మల్లన్న సాగర్ భూసేకరణ అంశంపై ఫిర్యాదు చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న భూసేకరణపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరగకుండా వారి పక్షాన తాము పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. భూసేకరణపై గవర్నర్ స్పందించాలని విజ్ఞప్తి చేశారు.