: విమానాశ్రయంలో రూ.80 లక్షల విలువైన బూస్టర్ డ్రగ్స్ పట్టివేత


బ్యాంకాక్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ.80 లక్షల విలువైన బూస్టర్ డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారని అధికారులు తెలిపారు. నాలుగు బ్యాగుల్లో తరలిస్తున్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో వచ్చిన ప్రయాణికుల బ్యాగులను చెక్ చేయగా 3,500 బాటిళ్ల డ్రగ్స్ బయపడినట్టు ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పంజాబ్‌కు చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించనున్నట్టు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆగస్టు 12న ఇలాంటివే 1200 బాటిళ్లను తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News