: ‘మై బ్రిక్స్’కు తెలంగాణ నుంచి కూడా స్పందన!... రూ.5.6 కోట్లకు చేరిన అమరావతి విరాళాలు!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాల కోసం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ‘మై బ్రిక్స్- మై అమరావతి’ పేరిట ఇచ్చిన పిలుపునకు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. గతేడాది అక్టోబర్ 22న అమరావతి నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన సందర్భంగా ‘మై బ్రిక్స్’కు చంద్రబాబు తెర తీసిన విషయం తెలిసిందే. చంద్రబాబు పిలుపునకు తొలుత భారీ స్పందనే వచ్చింది. ప్రస్తుతం ఈ స్పందన కాస్తంత తగ్గినా... స్పందిస్తున్న తెలుగు ప్రజల సంఖ్య మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటిదాకా 2.26 లక్షల మంది దాకా అమరావతికి ఇటుకలను విరాళంగా ప్రకటించగా, వాటి విలువ రూ.5,60,18,890కి చేరింది.