: స్టైలిష్ స్టార్ కు చోటు దక్కేనా?... కివీస్ తో పోరుకు టీమిండియా టెస్టు జట్టు ఎంపిక నేడే!
న్యూజిల్యాండ్ జట్టుతో టెస్టు సిరీస్ కోసం టీమిండియా టెస్టు జట్టు ఎంపిక నేడు జరగనుంది. భారత్ లోనే జరగననున్న మూడు టెస్టుల సిరీస్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టు కాన్పూర్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో టెస్టు జట్టు ఎంపిక కోసం నేడు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ముంబైలో ప్రత్యేకంగా సమావేశం కానుంది. జట్టు ఎంపిక విషయంలో ఇతర క్రికెటర్ల గురించి పెద్దగా పట్టింపు లేకున్నా... వన్డే స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్, స్టైలిష్ స్టార్ రోహిత్ శర్మకు టెస్టు జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అన్న విషయంపైనే ఆసక్తి నెలకొంది.