: నేను పట్టుబట్టడంతోనే నాటి ప్రధాని 6 హామీలిచ్చారు: వెంకయ్యనాయుడు
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి సంబంధించిన అంశాలపై తాను పట్టుబడతానని తమ పార్టీ మీటింగ్ లో నాడు చెప్పానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీకి సంబంధించిన అంశాల కోసం ఎంతవరకైనా తాను వెళ్తానని బీజేపీ కురువృద్ధుడు అద్వానీతో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు చట్టంలో పెట్టాలని చెప్పానని, తాను పట్టుబట్టడంతోనే సభలో నాటి ప్రధాని ఆరు హామీలు ఇచ్చారని చెప్పారు. హోదాను చట్టంలో పెట్టి ఉంటే ఈ పరిస్థితి నేడు తలెత్తేది కాదని అన్నారు. నాటి ప్రధాని హామీ ఇచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ కు వెళ్లలేదని, ఆనాడు నేను ఊహించిందే నేడు నిజమైందని వెంకయ్యనాయుడు అన్నారు.