: ప్రత్యేక ప్యాకేజ్ వల్ల నయాపైసా కూడా నష్టం జరగదు: సుజనా చౌదరి


ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ వల్ల నయాపైసా కూడా నష్టం జరిగే అవకాశమే లేదని, రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా న్యాయం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపి సుజనా చౌదరి అన్నారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాతో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మాత్రమే 90 శాతం నిధులు వస్తాయని, ఏపీకి ప్రత్యేకహోదా వస్తే అన్నీ వస్తాయనడంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. అంతర్జాతీయ సరిహద్దులు, గిరిజన రాష్ట్రాలకు మాత్రమే ఈ హోదా వర్తిస్తుందని అన్నారు. ప్రత్యేకహోదాకు, పరిశ్రమల రాయితీకి ఎటువంటి సంబంధం లేదని, ప్రత్యేక ప్యాకేజ్ వల్ల హోదా కంటే అదనపు సాయం ఏపీకి లభిస్తుందన్నారు. రాజధాని అభివృద్ధి సాయం కోసం కేంద్రం పూర్తి స్పష్టత ఇచ్చిందని సుజనా చౌదరి అన్నారు.

  • Loading...

More Telugu News