: చొరుబాటుకు యత్నించిన పాక్ ముష్కరులు... నలుగురు హతం, భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం


జమ్మూకాశ్మీర్ పరిధిలోని నౌగామ్ సెక్టారులో వాస్తవాధీన రేఖ వద్ద పాక్ ముష్కరుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. భారీ ఎత్తున ఆయుధాలు ధరించిన నలుగురు సరిహద్దులు దాటి ఇండియాలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటాన్ని పసిగట్టిన సైన్యం వారిని హతమార్చింది. వారి నుంచి నాలుగు ఏకే-47 రైఫిళ్లతో పాటు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు పుల్వామా జిల్లాలోని కరీంబాఫ్ జిల్లాలో సోదాలు నిర్వహించిన సైన్యం 12 మందిని అరెస్ట్ చేసింది. ఈ రైడింగ్ సందర్భంగా తమ గృహాలను నాశనం చేస్తున్నారని పలువురు గ్రామస్తులు రాళ్లు రువ్వడం, ఆపై భద్రతాదళాలు వారిని అడ్డుకోవడంతో 25 మందికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News